ప్రజలను వేధిస్తే.. వేటే

  • ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
  • ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదు
  • మహబూబ్ నగర్ లో డిస్కం డైరెక్టర్ కు ఉద్వాసన ఎస్ఈపై బదిలీ వేటు

ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై అధికారులు తనిఖీలు నిర్వహించడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. సచివాలయంలో గురువారం ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష జరుగుతుండగా.. ఈ అంశం చర్చకు వచ్చింది. వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని అధికారులకు చెప్పిందెవరని ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ సమావేశంలోనే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డకి వివరించారు. శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ రెడ్డి సొంతంగా ఆదేశాలిచ్చారని, ఆయన ఆదేశాల మేరకే అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఈని అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

సంగారెడ్డి పి‌సి‌బి (PCB) RO ను గాలికి వదిలేశారా..!
పొల్యూషన్ బాధితుల బాధలు వీరికి అవసరం లేదా..
గత MS వారంలో ఇన్స్ పెక్షన్ చేయాలి అని వేసిన కమిటీలు పనిచేయవా..
పూర్తిస్థాయి మెంబర్ సెక్రటరీ ఉంటేనే పి‌సి‌బి (PCB) అధికారులు పని చేస్తారా..

◆ సంగారెడ్డి EE, AEE లపై సీఎం రేవంత్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సంగారెడ్డి కలెక్టర్, ఆర్‌డి‌ఓ, ఏసీబీ, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేస్తామంటున్న పొల్యూషన్ బాధితులు, క్రషర్ల బాధితులు, పర్యావరణ వేత్తలు, ఫిర్యాదుదారులు..
◆ సీఎం రేవంత్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కొత్త ప్రభుత్వంలో ఆయిన పిసిబి మీద కాస్త దృష్టి పెట్టి దారిలో పెట్టాలని కోరుతున్న పొల్యూషన్ బాధితులు..
◆ కొత్త ప్రభుత్వంలోనైనా దారితప్పిన పి‌సి‌బి (PCB)ని దారిలో పెడతారని ఆశిద్దాం..
◆ సంగారెడ్డి పిసిబి ఆర్ఒ కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అధికారుల బాగోతాలపై కండ్లు బైర్లు కమ్మే నిజాలను పూర్తి ఆధారాలతో “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..