- మేడారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
- అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్
తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని అటవీ-పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో మేడారం జాతర నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) EE అవినీతి వెనుక ఉన్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
వసూళ్లలో ఆ ఉన్నతాధికారికి వాటా వెళ్తుందా..? ఈ వివరాలే కాక..
సంగారెడ్డి పరిధిలోని కాలుష్య పరిశ్రమల ఫిర్యాదుల విషయంలో.. CFE, CFO రెన్యువల్, అనుమతులలో లంచం డిమాండ్.. ఇంకా ఎన్నిరకాలుగా సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) RO కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అధికారుల (EE, AEE) బాగోతాలపై “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..