తూర్పు గోదావరిలో కాట్రేనికొన మండలం ఉప్పూడి దగ్గర గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..

తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి దగ్గర ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ అక్కడి రైతులలో కలకలం రేపుతుంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్‌ లీకైంది. భారీగా గ్యాస్‌ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్‌ లీకేజీని కంట్రోల్‌ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు.