అనుమతులు లేని అజాక్సీ కెమికల్ లేబొరేటరీ అగ్నిప్రమాదానికి దగ్ధమైంది. కెమికల్ కావడంతో భారీ మంటలు చెలరేగాయి. అయితే ఆదివారం సెలవు కావడంతో ఎలాంటి ప్రాణ, పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళితే బాలానగర్ లో టెక్నోక్రాస్ ఇండస్ట్రియల్ ఎస్టెట్ లో ఉన్న అజాక్సీ కెమికల్ లేబొరేటరీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు.
టాబ్లెట్లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తుంటారు. వాస్తవానికి దీనికి సంబంధించి తప్పనిసరిగా అనుమతులు ఉండాలి. అంతేకాకుండా ఫైర్ కు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కానీ ఇలాంటివి ఏవి లేకుండా సదరు నిర్వాహకుడు ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మొత్తం వ్యాప్తిచెంది ల్యాబ్ అంతా మంటలు అంటుకున్నా యి. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా ల్యాబ్లో ఉన్న కెమికల్ డబ్బాలను తక్షణమే కిందకు తీసుకురావడంతో మంటలు అంతగా వ్యాప్తి చెందలేదు. లేనిపక్షంలో పెద్ద పెనుప్రభావం సంబంవించేది. ఇది ఇలా ఉండగా నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వీటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
◆ సంగారెడ్డి పిసిబి (PCB) RO ను గాలికి వదిలేశారా..!
◆ సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) EE అవినీతి వెనుక ఉన్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
◆ వసూళ్లలో ఆ ఉన్నతాధికారికి వాటా వెళ్తుందా..? ఈ వివరాలే కాక..
సంగారెడ్డి పరిధిలోని కాలుష్య పరిశ్రమల ఫిర్యాదుల విషయంలో.. CFE, CFO రెన్యువల్, అనుమతులలో లంచం డిమాండ్.. ఇంకా ఎన్నిరకాలుగా సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) RO కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అధికారుల (EE, AEE) బాగోతాలపై “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..