హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లో 17 మంది సీఐలు బదిలీ

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 17 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల క్రితం బదిలీ అయిన ఇద్దరిని తిరిగి అదే పోస్టులకు నియమించగా మరొకరిని సీసీసీ నుంచి వెస్ట్‌జోన్‌ పీసీఆర్‌కు బదిలీ చేశారు. వీరితో పాటు మల్టీజోన్‌-2 నుంచి వచ్చిన 7 మందికి వివిధ ఠాణాలలో ఎస్‌హెచ్‌వో, డీఐలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 7 మందిని మల్టీజోన్‌-2కు సరెండర్‌ చేశారు.