గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శిగా నిలిచారు – ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎమ్మెల్యే మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ భావితరాలకు మార్గదర్శి అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటి ఎదుగుదలకు వనరులు సమకూరుస్తానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో సినిమా ఇండస్ట్రీలో గ్రీన్ ఛాలెంజ్ లో ముఖ్య పాత్ర పోషించిన కాదంబరి కిరణ్ గారు , లక్ష్మణ్ గారి పీఏ భాస్కర్ గార్లు పాల్గొన్నారు.