◆ తెలంగాణ పిసిబి (PCB)లో కొంతమంది అధికారుల ఇష్టారాజ్యమా..?
◆ తెలంగాణ పిసిబి (PCB)కి ప్రభుత్వంతో పనిలేదా..
◆ తెలంగాణ పిసిబి (PCB)కి చట్టాలు వర్తించవా..
◆ తెలంగాణ పిసిబి (PCB) అధికారులు కోర్టులను కూడా ధిక్కరిస్తారా..
◆ ముదావత్ చంద్రకాంత్ నాయక్ ను ఇంకా కాపాడాలని చూస్తున్న ఆ కొంతమంది తెలంగాణ పిసిబి (PCB) అధికారులు ఎవరు..
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ శాఖకు సంబంధించిన పోల్యుషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పర్యావరణ ఇంజనీరు ముదావత్ చంద్రకాంత్ నాయక్ కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ డిసెంబర్, 29 శుక్రవారం రోజు తీర్పు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే..
కానీ తెలంగాణ పిసిబి (PCB)లో జరుగుతున్నది వేరు. కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ చంద్రకాంత్ నాయక్ ప్రతి రోజు పిసిబి కార్యాలయానికి వస్తున్నారు అని పలువురు పిసిబి అధికారులే చెప్పడం విశేషం. అంతేకాదు పిసిబి అధ్వర్యంలో జరిగే మీటింగ్ లకు కూడా హాజరువుతూ తన డ్యూటీని ఎప్పటిలాగే నిర్వహిస్తున్నాడు అని పిసిబి అధికారులే చెబుతుంటే.. కోర్టులంటే వీరికి గౌరవం లేదనుకోవాలా.. లేక కోర్టు తీర్పులు మాకు వర్తించవు అని తెలంగాణ పిసిబి అధికారులు అనుకుంటున్నారా.. చంద్రకాంత్ నాయక్ ను ఇంకా కాపాడాలని చూస్తున్న అధికారులు ఎవరు..? పూర్తి వివరాలు రాబోయే కథనంలో..
సంగారెడ్డి PCB RO కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అధికారుల బాగోతాలపై మరియు ఆయా అధికారులు గతంలో పనిచేసిన చోట చేసిన, జరిగిన అనేక అవినీతి అక్రమాలపై కండ్లు బైర్లు కమ్మే నిజాలను పూర్తి ఆధారాలతో “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..