కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మేడి గడ్డ పర్యటన: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

  • కోటి ఎకరాలకు నీరందించాం అన్నది అబద్ధం
  • 94వేల కోట్లు కర్చు పెట్టి కేవలం నీరు అందిందించింది 98 వేల ఎకరాలకే
  • 2లక్షల కోట్లతో ప్రాజెక్ట్ కడితే 19.63లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించే సామర్ధ్యం
  • రాజకీయ లబ్ధికోసం కాళేశ్వరం గురించి పబ్లిసిటీ లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంవృధా
  • మంత్రుల బృందం తో మేడి గడ్డ లక్ష్మీ బ్యారేజ్ పరిశీలించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మేడి గడ్డ లో పర్యటించి భారీ నీటి పారుదల, ఆయకట్టు అభివ్రుద్ది శాఖ ఆధ్వర్యంలో మేడి గడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నిర్వహించిన సమీక్షా సమావేశం (పవర్ పాయింట్ ప్రజెంటేషన్)
కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు.

రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి మేదిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ ప్లోర్ లీడర్ లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడి గడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి నుంచి ప్రాజెక్టు ఎడమ వైపు లోని కాపర్ డ్యాం వద్దకు చేరుకొని పిల్లర్ల లో పగిలిన 7వ బ్లాకు ప్రాంతాన్ని పరిశీలించారు.

అనంతరం మేడి గడ్డ వద్ద మంత్రుల బృందం, ఎమ్మెల్యే లతో కలిసి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొని ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచాన వ్యయం నిర్మాణానికి జరిగిన కర్చు , విద్యుత్ బిల్లు సంవత్సరం లో జరిగిన మింటినెన్స్ కర్చులు,ఎన్ని ఎకరాల ఆయకట్టు కు నీరు అందిస్తున్న విషయాల పై భవిష్యత్ కార్యాచరణ పై పి పి టి ద్వారా అదిగి తెలుసుకున్నారు..
విజిలెన్స్ అధికారుల ద్వారా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు..