నల్లగొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసిన ఆలయ కమిటీ,అధికారులను అభినందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట, చెర్వుగట్టు దేవాలయాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్భుతంగా అభివృద్ధి అయ్యాయి అన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి.
నార్కట్ పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలనుపురస్కరించుకుని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి పూజ కార్యక్రమంలోపాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం రాష్ట్ర అభివృద్ధికి పని చేస్తున్నారన్నారు. అత్యంత మహిమ కలిగిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు .ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని దర్శించుకొని పూజ కార్యక్రమంనిర్వహిస్తానన్నారు . ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలకుబ్రహ్మాండమైన ఏర్పాట్లు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిందని శాసన మండలి చైర్మన్ అభినందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న యాదగిరి గుట్ట, చెర్వుగట్టు దేవాలయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా అభివృద్ధి అయ్యాయి అని ఆయన అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాను ఇంతలా అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ కి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.