సీఎంహెచ్ లాబరేటరీస్ పరిశ్రమ రియాక్టర్ పేలీ అగ్ని ప్రమాదం

• ఒకరి పరిస్థితి విషమం, ముగ్గురుకి గాయాలు

పాశం మైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది అగ్ని ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి గాయాలైన సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బీడీఎల్ సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం… పటాన్ చెరు మండల పరిధిలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిఎంహెచ్ లాబోరేటరీస్ పరిశ్రమలో మంగళవారం రాత్రి పదిమంది కార్మికులు పనిచేసే చోట ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో పరిశ్రమ వనమాలి పరిశ్రమలో అగ్ని కీలలు పడి మంటలు వ్యాపించాయి. రియాక్టర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఒరిస్సా కు చెందిన గోయదర్ రావు (52) బీదర్ చెందిన దత్తు (35) బాపట్ల కు చెందిన పటాన్ కాలేష వాలి (28), గాయాలు కాగా, మొంటు మాలిక్ (28)కు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్ లో హుటాహుటిన పటాన్ చెరు పట్టణంలోని ధ్రువ ఆసుపత్రికి తరలించగా, గాయాలైన ముగ్గురిని ఇస్నాపూర్ లో గల కాకతీయ ఆసుపత్రికి తరలించారు. మొంటు మాలిక్ పరిస్థితి విషమంగా ఉంది. అదేవిధంగా మంటలు ఆర్పేందుకు వెళ్లిన మరో నలుగురికి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి వెళ్లారు. దీంతో వారిని దృవ హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.