క్రషర్లు, క్వారీలు నిలిపివేసి మా గ్రామాన్ని కాపాడండి

  • ఒకవైపు కాలుష్యం కంపు.. మరోవైపు బ్లాస్టింగ్ భారీ శబ్దాలు..
  • క్రషర్లు, క్వారీలు ఎదుట మాదారం గ్రామ యువకుల ఆందోళన

క్రషర్లు, క్వారీలను నిలిపివేసి తమ గ్రామాన్ని కాపాడాలని మాదారం గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామ పరిధిలో ఉన్న క్రషర్లు క్వారీల వద్ద గ్రామ యువకులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాదారం గ్రామ పరిధిలో ఉన్న క్రషర్లు, క్వారీలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగే బ్లాస్టింగ్ భారీ శబ్దాలతో తమ గ్రామాన్ని కుదిపేస్తుందని మండిపడ్డారు. ఒకవైపు కాలుష్య కంపు మరోవైపు బ్లాస్టింగ్ తో గ్రామంలో నివసించలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించకుండా నూతన క్వారీలను ఏర్పాటు చేశారని.. నిబంధనలను కాలరాస్తూ సహజ వనరులను కొల్లగొట్టడం, దుమ్ము, ధూళితో పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రజారోగ్యాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యతమ్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సహజవనరులను రక్షించడంతో పాటుగా సేవ్ మాదారం పేరుతో ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.

తాము ఇప్పటికే ఈ క్వారీలను నిలిపివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశామని తెలిపారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని వాపోయారు. ఇకపై ఈ క్వారీలను పూర్తిస్థాయిలో నిలిపి వేసే వరకు ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ విజయ్, ఎం.సుదర్శన్, కే. అంబదాసు, టి రమణ సింగ్, సిహెచ్ గణేష్, కె వెంకటేశం గౌడ్, చంద్రశేఖర్, రమేష్, శ్రీనివాస్, సంతు, పాండు, సంపత్, నరేష్, ఆనంద్, బాలేష్, చంటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.