ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు.

సీనియర్‌ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఆమె భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.