తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) చైర్పర్సన్ గా, పీసీబీ సభ్య కార్యదర్శి (MS) కన్వీనర్ గా 15 మంది సభ్యులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల నుంచి మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ జెడ్పీ వైఎస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్, నిజామాబాద్ కార్పొరేటర్ మొహమ్మద్ పరూన్ ఖాన్ లను సభ్యులుగా నియమించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య ఛాంబర్ల సమాఖ్య అధ్యక్షుడు మీలా జయదేవ్, జెఎన్టీయు ప్రొఫెసర్ విజయలక్ష్మీ, భారత రైతు సంఘాల కన్సార్టియం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.