సిపిటిసి ఆధ్వర్యంలో 12 వేల మొక్కల పెంపకం

సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి) లో మియావాకి పద్ధతిలో పెంచనున్న 12 వేల మొక్కల పెంపకం ప్రారంభం. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మంత్రి గంగుల కమలాకర్
చిట్టడవులు పెంపకంలో భాగంగా మియావాకి పద్ధతిలో ఒక ఎకరం విస్తీర్ణంలో 12వేల మొక్కల పెంపకాన్ని చేపట్టడం జిల్లాలో ఇదే ప్రథమం.
ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటుగా జ పోలీస్ కమీషనర్ లతో పాటు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరైనారు.
పోలీసు అంటే లాఠీలు, తూటాలు కాదు…శాంతి భద్రత లతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా అభినందనీయం. సామాజిక బాధ్యతగా భావించి.. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది..నగరం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి… పోలీస్ వ్యవస్థ పటిష్టాంగ ఉంది… శాంతి భద్రత లు అదుపులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయి… సీఎం కేసీఆర్ స్పూర్తితో హరితహారం లో పాల్గొంటున్నారు..వాతావరణం సమతుల్యత దెబ్బతినడంతో ..సకాలంలో వర్షాలు పడడంలేదు…భావితరాల భవిష్యత్ కు మొక్కలు నాటలి… పర్యావరణమ్ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్క లు నాటలి… సీసీ కెమెరాల తో నగరం సేఫ్ గా ఉంది…సిపిటీసీ లో పెండింగ్ ఉన్న రోడ్డును స్మార్ట్ సిటీలో నిధులు కేటాయించి పూర్తి చేస్తాము..12,500 మొక్కలు నాటడం జరిగింది..