ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 13న ఎన్నిక‌లు.. జూన్ 4 ఓట్ల లెక్కింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ, లోకసభ  ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఒకే విడుత‌న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. నామినేష‌న్ల‌ను ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. ఏప్రిల్ 26న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివరి తేదీ ఏప్రిల్ 29. మే 13న ఎన్నిక‌లు నిర్వ‌హించి, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. జూన్ 11తో ఏపీ అసెంబ్లీ గ‌డువు ముగియ‌నుంది.