- అప్పుడు నాట్లు.. ఇప్పుడు నోట్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్
భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ (Sub registrar ) మహమ్మద్ తస్లీమా, డాటా ఆపరేటర్ ఆలేటి వెంకటేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ACB ) రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో సాయంత్రం దాడులు నిర్వహించారు.
గూడగాణి హరీష్ అనే వ్యాపారి తన భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం దరాఖాస్తు చేసుకోగా లంచం డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లీమా, డాటా ఆపరేటర్ ఆలేటి వెంకటేశ్ మధ్యవర్తిగా రూ.19,200 లంచం తీసుకుంటుండగా వరంగల్‌కు చెందిన ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.