హైదరాబాద్ లో ఎర్త్ అవర్

  • ఆరోగ్యకరమైన ప్రపంచం కోసమే : పిసిబి మెంబర్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో “పుడమి కోసం ఒక గంట కార్యక్రమం” ను నిర్వహించండం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో భూమిని కాలుష్యం నుండి పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడంతో ఎర్త్ అవర్‌ను జరుపుకుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ద్వారా ప్రతి సంవత్సరం మార్చి 23న ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం కార్బన్ పాదముద్రను తగ్గించి, శీతోష్ణస్థితి మార్పులను తగ్గించే కార్యకలాపాలను ప్రోత్సహించడం. కార్బన్ డయాక్సైడ్ తో బాటు గ్రీన్ హౌస్ వాయువులను వెదజల్లే ఇంధనాల కోసం శిలాజ ఇంధనాలను కాల్చడం నుండి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం అనేక అంశాలను పరిగణించాలి. సంస్థలతో బాటు వ్యక్తి గతంగా మన ఇళ్ళలో 8.30 P.M నుండి 9.30 P.M లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఈ కార్యక్రమం జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా టిఎస్‌పిసిబి, టిఎస్ సెక్రటేరియట్, అసెంబ్లీ, చార్మినార్ తో పాటు బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్త్ అవర్‌ను పాటించి, అన్ని పిసిబి ప్రాంతీయ, జోనల్ కార్యాలయాలలో 60 నిమిషాల పాటు లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలని
ఆదేశించారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు నడక, సైక్లింగ్, కార్ పూలింగ్ వంటి పర్యావరణ అనుకూల రవాణా పద్ధతుల్ని అనుసరించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రజా రవాణా వ్యవస్థ అవసరం” అని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది.