బిస్కెట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఉన్న రవి బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.