అట్టపెట్టెల గోదాంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

హైదరాబద్‌ నగరంలోని అత్తాపూర్‌లోని(Athapur) ఓ అట్టపెట్టెల గోదాంలో(Carton warehouse) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.