మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నవీ ముంబై (Navi Mumbai)లోని ఎమ్‌ఐడీసీ (MIDC)లో గల నవభారత్ ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీ (Navabharat Industrial Chemical Company)లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి.
