ఫోన్‌ ట్యాపింగ్‌లో నాపై ఆరోపణలు చేసినవారికి నోటీసులు: కేటీఆర్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎందుర్కొంటానని స్పష్టం చేశారు. నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వార్నింగ్‌ ఇచ్చారు.

‘నా పరువుకు నష్టం కలిగించిన ఓ మంత్రితోపాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కేకే మహేందర్‌కు నోటీసులు పంపిస్తా. నిరాధార, అసత్య ఆరోపణలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవాలను తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం.’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.