లంచం తీసుంకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో లైన్‌ ఇన్స్‌పెక్టర్‌

లంచం తీసుంకుంటూ ట్రాన్స్‌కో లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మహేశ్‌ అనే వ్యక్తికి విద్యుత్‌ మీటర్‌ మంజూరు చేయడానికి లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ సురేశ్‌బాబు రూ.8 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ఈ రోజు సబ్‌స్టేషన్‌ వద్ద మొదటి విడతగా రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.