లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే ముందున్నది. ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న పార్టీ.. పార్లమెంటు నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నియమించారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..
- పరకాల- ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్
- పాలకుర్తి- ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్
- స్టేషన్ ఘనపూర్- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
- వరంగల్ వెస్ట్- కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్
- వరంగల్ ఈస్ట్- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
- వర్ధన్నపేట- కే. వాసుదేవారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు
- భూపాలపల్లి- ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య