
ఈ నెల 7వ తేదీన ఎంజీబీఎస్, జేబీఎస్ మధ్య మెట్రో రైలు కారిడార్ -3 మార్గం ప్రారంభం కానుంది. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. 
రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ హైదరాబాద్ వాసుకే కాకుండా.. జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం హైదరాబాద్ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది.