పరిశ్రమల వల్ల జరిగే కాలుష్యాలపై చర్యలు తీసుకోవాలి : టీఎస్ పీసీబీ సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి

పరిశ్రమల వల్ల జరిగే కాలుష్యాలపై పీసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్ పీసీబీ సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎస్ పీసీబీ) మెంబర్ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీఎస్ పీసీబీ సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… తాండూర్ లోని ఆసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతుంది అని దాని వల్ల పరిసరాల్లో ఉన్న గ్రామ ప్రజలు మరియు స్కూల్ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు. అలాగే చందన్వెల్లి గ్రామంలోని కుందన్ టెక్స్ టైల్స్ మరియు శంషాబాద్ లోని శ్రీ కృష్ణ డ్రగ్స్ ద్వారా కూడా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. వీటితో పాటు మోకిల గ్రామంలో నిర్మిస్తున్న విల్లాలు మరియు అపార్ట్మెంట్స్ నిర్మాణ వ్యర్ధం మొత్తం గండిపేట చెరువులోకి వదులుతున్నారు అని తెలపడం జరిగింది. దీనిపై స్పందిస్తూ టీఎస్ పీసీబీ సభ్యులు అందరూ మోకీల గ్రామంలోని నిర్మాణాలను సందర్శించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.