అడవులతోనే మనుగడ సాధ్యం : టీఎస్‌ఎఫ్‌డీసీ మేనేజర్‌ గోగు సురేశ్‌కుమార్‌

 అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ) మేనేజర్‌ గోగు సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. వేసవి నేపథ్యంలో అడవులు, ప్లాంటేషన్‌ ఏరియాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే పర్యావరణానికి ఎంత నష్టమో వివరించారు.

అగ్ని ప్రమాదాల నివారణకు ప్లాంటేషన్‌ వాచర్లు రాత్రిళ్లు కాపలా కాస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల రేంజ్‌ పరిధిలోని జైపూర్‌, భీమారం, చెన్నూర్‌, కోటపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతా ల్లో నీలగిరి, టేకు ప్లాంటేషన్‌లు విస్తరించి ఉన్నాయని, వీటి రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు, వానకాలంలో మొకలు పెంచడానికి ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒకరూ సహకరించాలన్నారు. అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు, సిగరెట్‌లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు.