ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పరిశీలకుడిగా రాహుల్‌ బొజ్జ

వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2000 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌హెచ్‌ రాహుల్‌ బొజ్జను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌కు నామినేషన్ల పరిశీలనకు వచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్‌ దాసరి హరిచందన మొకను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ మహేందర్‌, నల్లగొండ జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఉన్నారు.