రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్

 బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు జ‌ర‌గ‌నుంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి కేసీఆర్ మాట్లాడే అవ‌కాశం ఉంది.

కేసీఆర్ బ‌స్సు యాత్ర నేటితో ముగియ‌నుంది. ఏప్రిల్ 24వ తేదీన కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభం కాగా.. అన్ని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ అధినేత ప‌ర్య‌టించారు. రోడ్ షోలు, కార్న‌ర్ మీటింగ్స్‌లో కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.