తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత, కూతురు నైమిషాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటేశారు. సీఎం రాక నేపథ్యంలో కొడంగల్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.