ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మ‌ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వ‌ర‌కు క‌విత రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేర‌కు జ‌డ్జి కావేరి బ‌వేజా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ కేసులో మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయం విదితమే.