సూర్యాపేట చెరువులో విష ప్రయోగం.. భారీగా చేపలు మృతి

చెరువులో విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృతి చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట పట్టణ పరిధి కుడకుడ 1వ వార్డులోని గుండ్లకుంట చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు క్రిమిసహారక మందు కలపడంతో పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.