నిజామాబాద్ డీఎస్వో, డీఎం సస్పెన్షన్
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు సివిల్ సప్లయ్ అధికారులపై వేటు పడింది. నిజామాబాద్ డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్ ను పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడడం, ఓ రైస్ మిల్లు నుంచి మరో రైస్‌మిల్లుకు ధాన్యాన్ని తరలించడంలో వీరిపాత్రపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో శాఖాపరంగా విచారణ చేపట్టగా అక్రమాలు వెలుగుచూసినట్లు సమాచారం. జిల్లాలో ఐదు రైస్‌మిల్లులకు ధాన్యం తరలించినట్లు రికార్డుల్లో చూపించగా.. ఇందులో ఏ ఒక్క రైస్ మిల్లుకు ధా న్యం చేరకుండా కాగితాలకే పరిమితమవడం గమనార్హం. డిఫాల్ట్ రైస్ మి ల్లులు ఎక్కువగా నిజామాబాద్, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉన్నా యి. రైస్‌మిల్లర్లకు డీఎస్వో, డీఎం సహకరించడంతోనే బియ్యం రికవరీ కావడంలేదని, మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యాన్ని గుట్టుగా విక్రయించడం, పీడీఎస్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో బహిర్గతమైంది. దీంతో వారిపై వేటు వేశారు.