ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా.. అదేబాటలో మరో 20 మంది సలహాదారులు

ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీకి చెందిన పలువురు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. నిన్న  భూమన కరుణాకర్‌ రెడ్డి  టీటీడీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయగా అదేబాటలో బుధవారం మరికొందరు రాజీనామాలు చేశారు.

ప్రధానంగా వైఎస్‌ జగన్‌కు నమ్మిన బంటుగా ఉన్న ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరో 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. మీడియా సలహాదారు అమర్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, తదితరులు తమ పదవులకు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.