ఈ నెల 11న టీడీపీఎల్పీ సమావేశం జరుగుతుందని టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కూడిన నివేదికను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేస్తామని తెలిపారు.
ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలు పార్టీల నేతలు హాజరుకానున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రధాని ప్రమాణస్వీకారంతో పాటు ఒడిశాలో జరిగే బీజేపీ సీఎం ప్రమాణస్వీకారంలో పాల్గొంటారని వివరించారు.