రామోజీ రావు మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. స్వయం కృషితో ఎదిగిన గొప్ప దార్శనికుడని చెప్పారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

రామోజీ మృతి పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంతాపం తెలిపారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం నేడు అందరికీ ఆదర్శమని చెప్పారు. తెలుగువాడి సత్తాను యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.