ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్, మరో 23 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, మాజీ గవర్నర్ తమిళిసై, తదితరులు హాజరయ్యారు.
ఎందుకంటే తమకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అని భావించిన పలువురు సీనియర్లకు తాజా జాబితాలో చోటు దక్కలేదు. వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, GV ఆంజనేయులు, కూన రవి తదితరులు ఉన్నారు.
వీరితోపాటు JC అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళితోపాటు రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు కూడా అవకాశం దక్కలేదు.