బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆవి ష్కరించి మాట్లాడారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. బ్యాంకర్స్‌కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలి.
బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండదని తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని స్పష్టం చేశారు.