పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్‌లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల గత 12 నెలల హాజరు వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులందరికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.
