ఏపీ పీసీబీ చైర్మన్ పదవికి మాజీ సీఎస్ సమీర్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ బాధ్యతలను సీఎస్ నీరభ్కుమార్కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నుంచి అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు. గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారన్న ఆరోపణల నేపథ్యంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు అందర్నీ బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో బదిలీ అయిన అధికారులు జీఏడీకి రిపోర్టు చేస్తున్నారు. తాజాగా బుధవారం రోజు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి జీఏడీలో రిపోర్టు చేశారు. వీరితో పాటు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా జీఏడీలో రిపోర్టు చేస్తున్నారు. వీరికి ఎప్పుడు పోస్టింగ్లు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు.