గిరిజనుల కుంభమేళా మేడారం మహా జాతర రెండవ రోజు కొనసాగుతోంది. ఇవాళ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వనదేవతలను దర్శించుకుని మొక్కులను సమర్పించుకున్నారు. జాతరకు తరలివచ్చిన భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.