సూర్యాపేట జిల్లా సుల్తాన్‌పూర్ రిజర్వ్ ఫారెస్టులో భూముల ఆక్రమణల ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన సాగర్, నాగార్జున సిమెంట్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
అటవీ ప్రాంతంలో సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై అధికారులకు తెలిసి చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది కర్నాటి వెంకటరెడ్డి ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దీనిపై జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.