హాజీపూర్‌ వరుస హత్య కేసుల దోషి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు. దీంతో న్యాయస్థానం దోషి శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. వరుస హత్య కేసులపై నల్లగొండ పోక్సో కోర్టులో గత కొంతకాలంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి విచారణ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి అమ్మాయిలను హత్యచేసి బావిలో పూడ్చినట్లు నిరూపితమైందని న్యాయమూర్తి వెల్లడించారు. మూడో కేసుల్లో 11 ఏళ్ల బాలికను ముక్కుమూసి చంపినట్లు నిరూపితమైందన్నారు. ఏమైనా చెప్పుకునేది ఉందా, శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని అడిగారు. దీనిపై దోషి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ.. హత్య కేసుల గురించి తనకేమీ తెలియదన్నాడు. తన ఇల్లు తగలబెట్టారని… భూములు లాక్కున్నారంటూ రోదించాడు.