ఇవాళ జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మెట్రోను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మార్గంలో (11 కి.మీ) మెట్రో రైళ్లు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌ వద్ద ఏర్పాటు చేయనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్‌ నగరంలో 69 కి.మీ మెట్రోమార్గం అందుబాటులోకి వచ్చింది.
ఇవాళ ప్రారంభం కానున్న మెట్రోరైలు మార్గంలో జేబీఎస్‌ – పరేడ్‌ గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్లు ఉన్నాయి.