ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. 32 మందిని బదిలీచేస్తూ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను ఏపీ సీఆర్‌డీఏలోకి పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రొటోకాల్‌ డైరెక్టర్‌గా టి.మోహన్‌రావును నియమించారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పి.రచనకు పోస్టింగ్‌ ఇచ్చారు. శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా బాపిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఏపీ శిల్పారామం సొసైటీ సీఈవోగా వి.స్వామినాయుడిని నియమించారు. సీసీఎల్‌ఏ సహాయ కార్యదర్శిగా డి.లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.