ఏసీబీకి చిక్కిన ల్యాండ్‌ అండ్‌ సర్వే ఉద్యోగులు

 నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ల్యాండ్‌ అండ్‌ సర్వే కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన సల్ల హరీశ్‌ సేత్వార్‌ పని కోసం ఈ నెల 5న కలెక్టరేట్‌లోని ల్యాండ్‌ అండ్‌ సర్వే కార్యాలయానికి వెళ్లాడు.

తన పని చేయాలని కోరగా రూ.20 వేల లంచాన్ని జూనియ ర్‌ అసిస్టెంట్‌ జగదీశ్‌ డిమాండ్‌ చేయగా, 10 వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. శుక్రవారం కార్యాలయంలో డబ్బు లు తీసుకుంటుండగా జూనియర్‌ అసిస్టెంట్‌ జగదీశ్‌, అటెండర్‌ ప్రశాంత్‌ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.