మూసీ నదికి కాలుష్య కాటు

  • ట్యాంకర్లలో అక్రమంగా రసాయన వ్యర్థాల తరలింపు
  • PCB అవినీతి అధికారుల అండతోనే తెగిస్తున్న పరిశ్రమలు..
  • PCB అధికారుల అవినీతిపై ACB మరియు విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ నిఘా..
  • కొంతమంది PCB అధికారులపై ఇప్పటికే పలు ఫిర్యాదులు..
  • విచ్చల వీడి అవినీతికి పాల్పడుతున్న కొందరు PCB RO అధికారులు..

కొందరు పరిశ్రమల నిర్వాహకులు హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలను వ్యర్ధాల డంపింగ్ కేంద్రంగా మారుస్తున్నారు. ఇషష్టారీతిన ట్యాంకర్లలో వేల లీటర్ల రసాయన వ్యర్థాలను తరలిస్తూ ఇక్కడి జలాశయాలను, భూమిని కలుషితం చేస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో స్థానికులు పట్టుకున్న ట్యాంకర్ కలిపి ఇప్పటి వరకు పీసీబీ (PCB) 16 ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. PCB కండ్లు కప్పి పారబోసిన ట్యాంకర్ల లెక్కే లేదు అంటున్న పర్యావరణ వేత్తలు. పరిశ్రమల యాజమాన్యాలు ఇలాంటి చర్యలకు పూనుకోవడానికి PCBలోని కొంత మంది అవినీతి అధికారులే అని మండిపడుతున్న పర్యావరణ వేత్తలు, మేధావులు, కాలుష్య బాధితులు. పరిశ్రమల నుండి అడ్డగోలు లంచాలకు మరిగిన కొంత మంది అవినీతి PCB అధికారుల వల్లే ఈ కాలుష్యం అని వాపోతున్నారు. పరిశ్రమలు ఎంత పెద్ద తప్పులు చేసిన చర్యలు తీసుకోకుండా ప్రతిదానికి ఓ రేటు మాట్లాడుకొని వదిలేయడం PCBలోని కొంతమంది అవినీతి అధికారుల పనిలా మారిందని కాలుష్య బాధితులు చెబుతున్నా మాట. PCB అధికారులకు కాలుష్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసిన చర్యలు ఉండవని పైగా ఫిర్యాధులు చేసిన వారిపైనే రుబాబు చేస్తారు అని ఫిర్యాదుల గురించి పరిశ్రమల వారికి ముందుగానే సమాచారం ఇచ్చి భారీగా లంచాలు తీసుకుంటున్నారని పర్యావరణ వేత్తలు, కాలుష్య ఫిర్యాదుదారులు చెబుతున్నారు. అవినీతి PCB అధికారుల విచ్చల వీడి అవినీతికి వారి చేష్టలకు విసిగిపోయిన కొంతమంది పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు ACB మరియు విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ మరియు ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు అని తెలుస్తున్నది.

సీఎం రేవంత్ రెడ్డి మూసీని సుందరంగా మార్చాలని అనుకుంటుంటే రసాయన పరిశ్రమల వారు చేస్తున్న మూసీలో రసాయన వ్యర్ధాల డంపింగ్ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మూసీ వద్ద భూగర్భ పైపులైను వ్యవస్థ ఏర్పాటు, నకిలీ ఇన్వాయిస్ ల సృష్టి తదితర అంశాలను గమనిస్తే ఈ దందా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వీరి వెనుక అవినీతి అధికారుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు కోరుతున్నారు.

ఇటీవల స్వాధీనం చేసుకున్న ట్యాంకర్ల వివరాలివి..

  • ఇటీవల రాజేంద్రనగర్ లో వెలుగులోకి వచ్చిన వ్యర్థాల డంపింగ్ వ్యవహారంలో పాశమైలారం ప్రాంతానికి చెందిన రుద్ర టెక్నాలజీస్ (శ్రీనివాస ల్యాబ్స్) చాకచక్యంగా వ్యవహరించింది. జిప్సంను ఉత్పత్తి చేస్తున్న క్రమంలో వెలువడే హానికర వ్యర్థాలను అటవీ ప్రాంతంలో పారబోస్తున్నారన్న కారణంతో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ లోని ‘రాఘవేంద్ర కెమికల్స్’ పరిశ్రమను కాలుష్య నియంత్రణ మండలి 2023 ఏప్రిల్ 11న మూసివేయించింది. సాధారణంగా జిప్సం తయారీ పరిశ్రమల్లో సల్ఫ్యూరిక్, ఫ్లోరిక్, పాస్పోరిక్ ఆమ్లాలను వినియోగిస్తారు. వాడేసిన ఆమ్లాలను ఈ పరిశ్రమలు కొనుగోలు చేస్తుంటాయి. రాఘవేంద్ర కెమికల్స్ పరిశ్రమను మూసివేసినా ఆ పరిశ్రమకే వాడేసిన ఆమ్లాలను తరలిస్తున్నట్లు రుద్ర టెక్నాలజీస్ నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి వ్యర్థాల డంపింగ్ సాగిస్తోంది. ఈ క్రమంలోనే నవంబరు 26న బాపూ ఘాట్ బ్రిడ్జి వద్ద కెమికల్ వ్యర్థాలను అండర్ గ్రౌండ్ పైపులైను ద్వారా మూసీలో పారబోస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.
  • జులై 10న ఓ ట్యాంకర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు 5 వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపి పరిశీలించారు. రసాయన వ్యర్థాలున్నట్లు తెలియడంతో పీసీబీ అధికారులకు సమాచారం అందించారు.
  • ట్యాంకర్ లో తీసుకొచ్చిన రసాయన వ్యర్థాలను కూకట్ పల్లి సమీపంలోని ఓ జలాశయంలో పారబోస్తుండగా అక్టోబరు 25న స్థానికులు పోలీసు, పీసీబీ అధికారులకు సమాచారం అందించారు.
  • 2023 డిసెంబరు 29న నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతానికి చెందిన దశమి ల్యాబరేటరీస్ కు చెందిన ట్యాంకర్ జీడిమెట్లలో పట్టుబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటలను లెక్కలేనన్ని ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

త్వరలో పిసిబి (PCB)లోని కొంతమంది అధికారుల తీరు, వారి అవినీతిపై కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) & పిసిబి ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్లడమే కాక..ACB మరియు విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తలు సమాయత్తం అవుతున్నారు. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…