ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహ‌న్ బాబు

టాలీవుడ్ సీనియర్ న‌టుడు మంచు మోహన్‌ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంచు కుటుంబ వివాదం నేప‌థ్యంలో అస్వస్థత.. హైబీపీ ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో (Continental hospital) రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయ‌న‌.. చికిత్స అనంత‌రం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుప‌త్రి సిబ్బంది వెల్ల‌డించింది.