మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో జర్నలిస్ట్‌కు తీవ్రగాయాలు కాగా.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధర్నా చేయడం మొదలు పెట్టాయి. అయితే ఈ క్రమంలోనే నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియోను వదిలాడు.
కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అంటూ మోహన్ బాబు ప్రశ్నించాడు. దీనిపై ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఆలోచించాలి. కుటుంబ సమస్యలు అందరికి ఉంటాయి. మేం నటులం కాబట్టి కొంతమంది ఉన్నవి లేనివి వార్తల్లో చెబుతుంటారు. ఇలా వార్తలు చదివేవారు కూడా ఆలోచించాలి. వారి ఇంట్లో కుటుంబ సమస్యలు వస్తే ఇలానే బయటకు చెబుతున్నారా అని ఆలోచించుకోండి అంటూ మోహన్ బాబు అన్నారు.