తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్‌ఘన్‌పూర్‌, చేవెళ్లతోపాటు మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌ 3 మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మారుస్తూ గెజిట్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పట్టణ పరిధి పెరిగింది. 143గా ఉన్న మొత్తం మున్సిపాలిటీలు (మున్సిపాలిటీ కార్పొరేషన్లతో సహా) 155కి చేరుకున్నట్టు మున్సిపల్‌ శాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ గెజిట్‌ విడుదల చేసి 15 రోజులు దాటింది. 4వ తేదీనే గెజిట్‌ విడుదలైంది.

కొత్త మున్సిపాలిటీలు ఇవే..

స్టేషన్‌ఘన్‌పూర్‌, కేసముద్రం, ఎదులాపురం, అశ్వరావుపేట్‌, చేవెళ్ల, మొయినాబాద్‌, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్‌, దేవరకద్ర, మద్దూ రు, పరకాల మున్సిపాలిటీలుగా ఆవిర్భవించనున్నాయి. భద్రాద్రి కొత్తగూడం, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లను కార్పొరేషన్లుగా హోదా పెంచారు. కాగా ప్రస్తుత మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పాలక మండళ్లు ఈ నెల 26తో ముగియనున్నది.