- మరో మూడు కంపెనీలకు వ్యాపించిన మంటలు
- పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లే..
చర్లపల్లి పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్ర మాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపె నీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో మంటల్లో కాలి బూడిదైంది. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-1లోని సర్వోదయ కెమికల్స్‌లో వేస్ట్ కెమికల్స్‌ను ప్యూరిఫై చేస్తుంటారు. ఇలా శుద్ధి చేసిన కెమికల్స్‌ను వేలకొద్ది డ్రముల్లో స్టోర్ చేసి ఉంచుతారు. మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సర్వోదయ కెమికల్స్ నుంచి దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన స్థాని కులు ఫైర్ స్టేషన్‌కు సమాచారమివ్వడంతో అప్రమత్తమైన చర్లపల్లి పారిశ్రామికవాడ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఉవ్వెత్తున ఎగిసి పడ్డ మంటల కాస్తా పక్కనే ఉన్న ఫ్లోరోషీల్డ్ గ్లాస్ లైనింగ్, మహాలక్ష్మి రబ్బర్ కంపెనీలతో పాటుగా నిర్మాణంలో ఉన్న హైటెక్ ఇంజనీరిం గ్ కంపెనీకికూడా వ్యాపించాయి. అప్రమత్త మైన ఫైర్ సిబ్బంది అదనపు ఫైర్ ఇంజన్లు రప్పించి మంటలను అదుపు చేశారు. సుమారు 3-4 గంటల పాటుగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కంపెనీలోని ఓ భవనం కూలిపోయి నట్లు తెలిసింది. ప్రమాదానికి గంట ముందే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది అంతా తమ విధులు ముగించుకొని వెళ్లినట్లు సమా చారం. దీంతో ప్రాణాహాని తప్పిందంటు న్నారు. అగ్నిప్రమాదం జరిగిన నాలుగు కంపె నీల నష్టం రూ.కోట్లలో ఉంటుందని అంచనా..
పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లే..
పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఐలా చైర్మన్ జక్కా రోషిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి ప్రమాదక రమైన పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉంచ కూడదంటు పలుమార్లు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలి పారు. ఆరు నెలల క్రితం కంపెనీని మూసి వేశారని, తిరిగి అనుమతి ఇవ్వడంతో యథావిధిగా కంపెనీని నిర్వహించారని, ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంద న్నారు. కెమికల్ కంపెనీలను చర్లపల్లి పారి శ్రామికవాడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.
ఘటన స్థలాన్ని సందర్శించిన రాచకొండ సీపీ
అగ్ని ప్రమాదం విషయం తెలిసిన రాచకొండ సీపీ సుధీర్ బాబు ఘటన స్థలాన్ని సందర్శిం చారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకు న్నారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయనతో పాటుగా అడిషనల్ డీసీపీ వెంకట రమణ, కుషాయిగూడ ఏసీపీ మహేష్ కుమా ర్ తో పాటుగా ఇన్స్పెక్టర్లు ఘటన స్థలం వద్దే ఉండి పర్యవేక్షించారు. మంటలు పూర్తిగా అదు పులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక సమా చారం మేరకు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు.